జిల్లాలో భగ్గుమంటున్న భానుడి సెగ

జిల్లాలో భగ్గుమంటున్న భానుడి సెగ

అల్లూరిలో భానుడి సెగ మొదలైంది. ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34°C నుంచి 40°C వరకు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధలు, గర్భిణిలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.