VIDEO: అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ జిల్లా అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అర్హులైన వారికి ప్రభుత్వం తరపున ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రెండవ విడతలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.