ఎంఈవోగా వెంకయ్య బాధ్యతలు స్వీకరణ

NTR: వీరులపాడు మండల విద్యాశాఖ అధికారిగా కారుమూడి వెంకయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తానని వెంకయ్య చెప్పారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు ఆయనను కలిసి అభినందించారు.