VIDEO: పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్‌లు తీసుకెళ్లొద్దు
KMR: పిట్లంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లు మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకురావొద్దని, తమ ఫోన్లను బయటే ఉంచి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.