ధృవ్ విక్రమ్ 'బైసన్' రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'బైసన్ కాలమదన్'. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ వచ్చేసింది. ఈ ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఇది రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.