పంట నష్టంపై డ్రోన్ సర్వే

పంట నష్టంపై డ్రోన్ సర్వే

W.G: నరసాపురం మండలంలో తుపాను కారణంగా జరిగిన నష్టంపై శనివారం వ్యవసాయ శాఖ అధికారులు డ్రోన్ సాయంతో సర్వే చేపట్టారు. యర్రంశెట్టి వారి పాలెం గ్రామంలో ఆ శాఖ ఏడీఏ ప్రసాద్, సర్పంచ్ వైఎస్ నాగమత్యామాంబలు ఈ సర్వేను ప్రారంభించారు. డ్రోన్ సాయంతో సర్వే చేయడం వల్ల రైతులకు ఎంతోగానో ఉపయోగపడుతుందని, జరిగిన నష్టం ఖచ్చితంగా తెలుస్తుందని ఏడీఏ ప్రసాద్ అన్నారు.