జిల్లా స్థాయి క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులు
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 17 సంవత్సరాల లోపు 65 మంది విద్యార్థులు జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. వీరిని మండల విద్యాశాఖ అధికారి మనోజ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, ఫిజికల్ డైరెక్టర్ రేబాక, ఉపాధ్యాయులు అభినందించారు.