కుళ్లిన గుడ్లతో కేకుల తయారీ.. బేకరీ సీజ్

కుళ్లిన గుడ్లతో కేకుల తయారీ.. బేకరీ సీజ్

కరీంనగర్‌ రేకుర్తిలోని గణేష్ బెంగళూరు బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. దుర్వాసన వస్తున్న ఎగ్ పఫ్స్‌పై వచ్చిన ఫిర్యాదుతో తనిఖీ చేయగా.. పురుగులు పట్టిన మైదా, 420 కుళ్లిన గుడ్లను గుర్తించి షాక్‌కు గురయ్యారు. సుమారు రూ. 9 వేల విలువైన నిల్వలను ధ్వంసం చేసి, బేకరీని తాత్కాలికంగా సీజ్ చేశారు.