VIDEO: డబుల్ బెడ్ రూమ్ కాలనీలో లోపించిన పారిశుధ్యం

WNP: చిట్యాలరోడ్డు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పారిశుద్ధ్యం లోపించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇళ్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో దోమలు కుట్టి అనారోగ్యం బారిన పడుతున్నామని, పాములు సంచరిస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కమిటీ సభ్యులు బలరం వెంకటేష్ కోరారు.