VIDEO: 'తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దు'
NTR: వీరులపాడు మండలం పెద్దాపురం సరిహద్దులో శుక్రవారం ఎస్సై అభిమన్యు నాయక్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు హెచ్చరించారు. వాహనదారులు అన్ని పత్రాలు వెంట ఉంచుకుని నిబంధనలు పాటించాలని తెలిపారు.