నేడు ఉమ్మడి విశాఖ జడ్పీ సర్వసభ్య సమావేశం
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ ఛైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన నేడు జరగనుంది. ఉదయం 10:30కు జడ్పీ సమావేశ మందిరంలో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు నివేదికలతో హాజరు కావాలని సీఈఓ పి.నారాయణమూర్తి సూచించారు. వేసవి ప్రణాళికలు, తాగునీటి సమస్యలపై చర్చించనున్నారు.