నేటి నుంచి బంగారు కుటుంబంపై గ్రామ సభలు

NDL: మిడుతూరు మండల పరిధిలోని గ్రామాల్లో పీ4 బంగారు కుటుంబాలపై అభ్యంతరాలు, సవరణలపై నేడు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు. గ్రామాల్లో నిర్వహించిన సభలో గతంలో తయారు చేసిన బంగారు కుటుంబాలపై సభలో తెలపాలని ఆయన చెప్పారు. సేకరించిన వివరాలను అధికారులు ఈ నెల 25వ తేదీ లోపు అందజేయాలని పేర్కొన్నారు.