నిలకడగా గోదావరి ప్రవాహం

నిలకడగా గోదావరి  ప్రవాహం

BDK: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయం నుంచి నిలకడగా ఉంది. బుధవారం ఒక్కసారిగా పెరగడంతో ఒకేరోజు మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే. నిన్న 51.9 అడుగుల వరకు పెరిగిన నీటిమట్టం. ఉదయం 10 గంటలకు 47.5 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. నీటిమట్టం నిలకడగా ఉండడంతో స్థానికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.