ఎస్పీని కలిసిన సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు

ఆదిలాబాద్: జిల్లా ఎస్పీ గౌష్ ఆలంను డీపీవో కార్యాలయంలో సోమవారం సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డైట్ మైదానంలో సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాలు విజయవంతమయ్యేలా సహకరించినందుకు ఆయనకు మెమొంటో అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.