ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదు అయింది. దీంతో ఇండోనేషియా, ఫిలిపిన్స్, మలేషియా దేశాలకు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సులావేసి సమీపంలో సముద్ర గర్భంలో కేంద్రీకృతమైంది. ఈ భూకంపం సముద్ర మట్టానికి చాలా తక్కువ లోతులో సంభవించడం వల్ల సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రమాదం ఉందని తెలిపింది.