'ప్రతి ఒక్కరికి రేషన్ అందెలా చూడాలి'

'ప్రతి ఒక్కరికి రేషన్ అందెలా చూడాలి'

ప్రకాశం: మండలంలోని అన్ని గ్రామాల్లో అందరికీ రేషన్ అందేలా చూడాలని తహసీల్దార్ బచ్చల వెంకటరమణారావు తెలిపారు. తాళ్లూరులోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. రేషన్ షాప్ వారు సమయపాలన పాటించి, నిర్ణీత వ్యవధిలో ప్రజలకు సరుకు అందజేయాలని సూచించారు. రేషన్ డీలర్లు, కార్యలయ సిబ్బంది పాల్గొన్నారు.