రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా
SRD: జహీరాబాద్ మండలం బూచినెల్లి వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 65వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.