21వ వార్డు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి
NRML: నిర్మల్ పట్టణంలోని 21వ వార్డు కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఐఎం నాయకులు ఇర్ఫాన్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు, వినతిపత్రం సమర్పించారు. కాలనీలో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేవని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ తక్షణమే స్పందించి, కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.