రేపటి నుంచి పోలంపాడు పోలేరమ్మ తిరునాళ్లు

NLR: కలిగిరి (M) పోలంపాడు గ్రామంలో వెలసియున్న శ్రీ పోలేరమ్మ తిరునాళ్లు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన పోలంపాడు పోలేరమ్మ తిరునాళ్లు ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఆగస్ట్ 17 నుంచి 21వ తేదీ వరకూ 5 రోజులపాటు జరగనున్న ఈ తిరునాళ్లలో అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు.