లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

మండల కేంద్రమైన ఉంగుటూరు యర్ర చెరువు వద్ద సోమవారం రాత్రి లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ లారీ ఉంగుటూరు నుంచి నారాయణపురం టైల్స్ ఫ్యాక్టరీకి వెళుతుండగా అదుపుతప్పి వాగులో పడిపోయింది. లారీలో ఉన్న డైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. బోల్తా పడిన లారీని క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్నారు. దీని వలన కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.