నాగభూషణంకి విశిష్ట సేవా పురస్కారం

అనకాపల్లి: జిల్లాకి చెందిన బల్లా నాగభూషణం జాతీయ స్థాయి కళా, సామాజిక సేవా రంగం విశిష్ట అవార్డు (గిడుగు రామమూర్తి)కు ఎంపికయ్యారు. తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఈనెల 29న జరగనున్న సందర్భంగా విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో అవార్డు బహకరించనున్నారు. బల్ల నాగభూషణం గత 20 ఏళ్లుగా సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.