సినిమా వీడియోతో ప్రజలకు అవగాహన

కృష్ణా: సైబర్ నేరాలు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. అపరిచిత ఫోన్ కాల్స్‌కు స్పందించకూడదని, బ్యాంకు లేదా వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. సినీ దృశ్యాలతో ప్రత్యేక వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.