అంతస్తు నుంచి పడి బాలుడు మృతి

SRD: పటేల్ గూడా పరిధిలోని హరివిల్లు టౌన్ షిప్‌లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండ్రికి 'బై' చెప్పి ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్ రెండో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందాడు. రెయిలింగ్ పట్టుకుని ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.