నాగపూర్‌లో బీరప్ప మహంకాళి ఉత్సవాలు

ABD: ఉట్నూర్‌లోని నాగపూర్‌లో బీరప్ప మహంకాళి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బీరప్ప మహంకాళి భక్తులు వేషధారణలో వీధుల గుండా తిరుగుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం భక్తులు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.