భారత్ వైపు కదులుతున్న 'దిత్వా' తుఫాన్
భారత్ వైపు 'దిత్వా' తుఫాన్ దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీల వేగంతో ఇది కదులుతోంది. ప్రస్తుతం చెన్నైకి 250 కి.మీలు, పుదుచ్చేరికి కేవలం 160 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు సాయంత్రానికి ఇది పుదుచ్చేరి తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.