VIDEO: గ్రహణం ఎఫెక్ట్.. నిట్టనిటారుగా నిలిచిన రోకలి

VIDEO: గ్రహణం ఎఫెక్ట్.. నిట్టనిటారుగా నిలిచిన రోకలి

SRD: తాంబాలంలోని కొద్దిపాటి నీళ్లలో నిటారుగా రోకలి నిలబడిన అరుదైన అద్భుత దృశ్యం ఖేడ్‌లో ఇవాళ చోటుచేసుకుంది. ఖేడ్ పట్టణంలోని కాశీనాథ్ పటేల్ ఇంట్లో ఈ ప్రయోగం కనిపించింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే గ్రహణ సమయంలో రోకలి పళ్లెంలోని కొద్దిపాటి నీళ్లలో కదలకుండా నిటారుగా నిలిచింది. గ్రహణం వీడగానే రోకలి తనంతట తానే కింద పడిపోతుందని కుటుంబీకులు చెప్పారు.