VIDEO: మూడు టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు మూడు టన్నుల రేషన్ బియ్యం గుర్తించారు. బియ్యంతో పాటు వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టాస్క్ ఫోర్స్ సమాచారం మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.