లారీని ఢీకొని ఫోటోగ్రాఫర్‌కు గాయాలు
KDP: లింగాల మండలం పెద్ద కుడాల గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి లారీ ఢీకొని ఫోటోగ్రాఫర్ నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా, పార్నపల్లి నుంచి పులివెందుల వస్తున్న లారీ వెనుక భాగాన్ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన నారాయణను చికిత్స కోసం 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.