గండేపల్లిలో ఈస్టర్ పండగ వేడుకలు
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం గండేపల్లిలో ఈస్టర్ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. పాస్టర్ కొండా స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనల గానం, ఆరాధనలతో గ్రామం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. క్రైస్తవ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు పునరుత్థానం మానవాళికి నిరీక్షణ, శాంతిని ఇస్తుందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.