'ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి'

'ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి'

ELR: వేలేరుపాడు మండలం పూచిరాల కాలనీలో ఏపీ జిఎస్ శాఖ సమావేశం మచ్చ చందర్రావు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈనెల 9వ తేదీన జరిగే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. ఆదివాసి చట్టాలపై అవగాహన కల్పిస్తూ రాబోయే రోజుల్లో జిల్లాలో 170 ఆక్ట్‌ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేదానికి ఆదివాసీలందరూ ఏకంగా కావలసినటువంటి అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.