వికలాంగులకు మోటార్ సైకిళ్లను అందజేసిన ఎమ్మెల్యే
KNR: చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చొప్పదండి MLA, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం 67 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి/షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు వికలాంగులకు మోటర్ సైకిల్ (టూ వీలర్)లను అందజేశారు.