వైజాగ్ జూ పార్క్ దగ్గర రోడ్డు ప్రమాదం

వైజాగ్ జూ పార్క్ దగ్గర రోడ్డు ప్రమాదం

VSP: ఎండాడ జూ పార్క్ సమీపంలో సోమవారం ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో వెనక ఉన్న కారు ముందుభాగం పాక్షికంగా దెబ్బ తిన్నది. అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్లే ప్రమాదం జరిగిందని తోటి వాహనదారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.