పసిబిడ్డను చంపి తల్లి ఆత్యహత్య.. కారణం ఇదే..!
AKP: చోడవరంలో ఓ తల్లి తన ఆరు నెలల కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డీఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. వర కట్నం వేధింపులతో వీణ(29) అనే మహిళ తన ఆరు నెలల కొడుకుని చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.