నల్గొండ నుంచి HYDకు ప్రత్యేక బస్సులు
నల్గొండ డిపో నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించనునట్లు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. జిల్లా నుంచి హైటెక్ సిటీ, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టుకు రెండు డీలక్స్ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ నుంచి వయా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విప్రో హైటెక్ సిటీకి, ఎల్బీ నగర్ మీదుగా ఎయిర్ పోర్టు మధ్య ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు.