ఏసీబీ సోదాల్లో శాంతి అక్రమాస్తులు

ఏసీబీ సోదాల్లో శాంతి అక్రమాస్తులు

AP: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసాల్లో ACB సోదాలు జరిపింది. ఆమెకు విశాఖ ఎండాడలో ఒక లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లిలో జీ+2 భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో 700 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి, రూ.1.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బ్యాంకు ఖాతాల్లోని రూ.3 లక్షలు, ఒక వోక్స్‌వ్యాగన్ పోలో కారు, ద్విచక్రవాహనం ఉన్నట్లు నిర్ధారించింది.