మురళి నాయక్‌కు నివాళిలర్పించిన దళిత నాయకులు

సత్యసాయి: పెనుకొండ పట్టణం అంబేద్కర్ కూడలిలో భారత్ - పాకిస్తాన్ ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్‌కు బీజేపీ, దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎనుమల రామకృష్ణ, అంగడి రామాంజనేయులు, ఎం.రవి, హనుమంతు యాదవ్, మధుసూదన్, ముత్యాలమ్మ, సుభద్రమ్మ, గోవిందు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.