గుడుంబా, నాటుసారా స్వాధీనం

MDK: ప్రభుత్వం నిషేధించిన గుడుంబా నాటుసారాను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గుగులోత్ శ్రీను అక్కన్నపేట మం. మల్ చెరువు తండా నుంచి బైక్పై ప్రభుత్వం నిషేధించిన గుడుంబా, నాటు సారా తీసుకొని సిద్దిపేట వైపు వస్తున్నారు. ఈ మేరకు నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు గట్ల మల్యాలలో పట్టుకున్నారు.