'మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపొందడం ఖాయం'
VKB: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపొందడం ఖాయమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధరాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాగిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.