IPL: రేపు ముంబై vs రాజస్థాన్
గౌహతి వేదికగా పటిష్టమైన ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. యువ ఆటగాళ్లతో కూడిన రాజస్థాన్, ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది. మరోవైపు, స్టార్ ప్లేయర్లతో ఉన్న ముంబై గత మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.