పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

NLR: సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. రూ.1.22కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. రూ.45 లక్షలతో జలజీవన్ మిషన్ పనులు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. నూతన గృహాలు, మరికొన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.