జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
KMM: జిల్లాలో ఆదివారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 63.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. వేంసూరు 15.4, సత్తుపల్లి 13.4, ఎర్రుపాలెం 13.0, మధిర 11.6, పెనుబల్లి 5.2, కల్లూరు 4.6, బోనకల్ 0.4 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.