అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి లేఖ

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి లేఖ

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ డేటాను విడుదల చేయాలని అందులో కోరారు. గతేడాది జూన్ 12న ఎయిరిండియా171 విమానం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు సహా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు.