బాపట్ల డీఎస్పీగా చంద్రమౌళి బాధ్యతలు
బాపట్ల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా చంద్రమౌళి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన పోలీస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, మహిళల భద్రతకు, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.