రాజగోపాల్‌రెడ్డి వల్ల మునుగోడు నాశనం: మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిధులెవరు ఇస్తారని, MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల మునుగోడు నియోజకవర్గం నాశనం అవుతుందే తప్పా, ఎప్పటికీ అభివృద్ధి జరుగదని మాజీ MLA కూసుకుంట్ల ప్రభాకార్‌రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.