ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది: MLA
BHPL: చిట్యాల మండలంలోని చిట్యాల, అందుకుతండా, గిద్దెముత్తారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సాయంత్రం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం పూర్తిగా కొంటుందని హామీ ఇచ్చారు. నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి గిట్టుబాటు ధర పొందాలని కోరారు.