బొమ్మలరామారం మండలంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రచారం
BHNG: కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామాలలో చెప్పాలని డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం బొమ్మలరామారం మండలం మేడిపల్లి, మైలారం, పెద్ద పర్వతాపూర్, చౌదర్ పల్లి, యావపూర్ తండా తదితర గ్రామాలలో మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచ్ పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.