దసరా వేళ.. ముమ్మర తనిఖీలు

దసరా వేళ.. ముమ్మర తనిఖీలు

MDK: రామాయంపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దసరా పండుగ నేపథ్యంలో నాటుసారా, గంజాయి విక్రయాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రామాయంపేట బైపాస్ సమీపంలో ఎక్సైజ్ అధికారి సిద్ధార్థ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, నాటుసారా డ్రగ్స్ వాటిని తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.