518 మంది వలసకార్మికులు మృతి: మంత్రి
ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిలో 518 మంది వలసకార్మికులు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర మంత్రి ఖుంటియా తెలిపారు. వారిలో 395 పార్థివదేహాలను ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రానికి తెచ్చి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. మరో వైపు రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో 136 ఏనుగులు చనిపోయాయన్నారు. విద్యుత్ తీగలు, వేటగాళ్ల తూటాల కారణంగా అవి మరణించినట్లు చెప్పారు.