రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. టంగుటూరు నుంచి కామేపల్లి వైపుకు ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళ్తుండగా ఒక్కసారిగా కుక్క దారికి అడ్డంగా రావడంతో బండి అదుపుతప్పి పడిపోయింది. దీంతో బండిపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.