VIDEO: ఇది గొడవ అనుకుంటే పప్పులో కాలేసినట్లే!
NZB: సాలూర మండలం హున్సా గ్రామంలో వింత ఆచారమైన పిడిగిద్దులాట హోలీ వేడుకల వేళ నిన్న జరిగింది. గ్రామంలోని హన్‌మాన్ ఆలయం వద్ద రోడ్డు మధ్యలో తాడు కట్టి, రెండు వర్గాలుగా విడిపోయి ఒక చేత్తో తాడు పట్టుకుని, మరో చేత్తో పిడికిలి బిగించి కొట్టుకున్న గ్రామస్థులు. ఐదారు నిమిషాల అనంతరం ఈ వింత క్రీడ ముగిసింది. అనంతరం ఇరు వర్గాలు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుని వెళ్ళిపోయారు.